- జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు
- ఇందారంలో కమ్యూనిటీ కాంటాక్ట్
Community contact: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. జైపూర్ మండలం ఇందారం గ్రామంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. గ్రామంలో అనుమానాస్పదంగా కనిపించే కొత్త వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని, భద్రతా అంశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.

రౌడీషీటర్లకు కౌన్సిలింగ్
గ్రామంలోని రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీట్లకు ఏసీపీ వెంకటేశ్వర్లు కౌన్సిలింగ్ నిర్వహించారు. వారి జీవనశైలి, ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. శాంతియుతంగా జీవించే ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, వారి సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తారన్నారు.
నార్కోటిక్ డాగ్‌తో తనిఖీలు
ఇందారం గ్రామంలో నార్కోటిక్ డాగ్‌తో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వలపై నిఘా నిమిత్తం అనుమానాస్పద గృహాలు, పరిసర ప్రాంతాల్లో సోదాలు చేశారు. కార్డన్ సెర్చ్‌లో భాగంగా 70 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు సహా వాహనాల పత్రాలు చెక్ చేశారు. సరైన పత్రాలు లేని వాటికి జరిమానాలు విధించారు.

కార్యక్రమంలో శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణు చందర్, జైపూర్ ఎస్ఐ శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్, టీఎస్ఎస్పీ పోలీసులు, సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల(జైపూర్)
