- నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి
Anil Jadhav : బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, నియోజకవర్గంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. బోథ్ ను రెవెన్యూ డివిజన్ చేయాలని, బోథ్ లో నూతన ఫైర్ స్టేషన్ మరియు ప్రభుత్వ జనరల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, కుప్టి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని, పిప్పలకోటి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం అందించి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని, ఇచ్చొడలో నూతన పోలీసు సబ్ డివిజన్ ఏర్పాటు చేయాలని, బరంపూర్ నుంచి మూర్ఖండి రోడ్డు నిర్మాణానికి అటవీ అనుమతులు ఇచ్చి రోడ్డు పనులు ప్రారంభించాలని, సిరిచేల్మా నుంచి పెంబి వరకు అటవీ అనుమతులు ఇచ్చి రోడ్డు పనులు ప్రారంభించాలని, పురాతన సిరిచేల్మా మల్లికార్జున దేవాలయానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, బరంపూర్ వెంకటేశ్వర స్వామి ఆయాలయానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, దేగామ గ్రామ ORR ప్రాజెక్టు క్రింద భూములు కోల్పోయిన వారిని పునరావసం కల్పించాలని కోరారు.
వీటితో పాటు బోథ్ నియోజకవర్గంలో నెలకొన్న గిరిజనేతరులకు పొడు భూములకు పట్టాలు ఇచ్చి సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ దీనికి సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.
శెనార్తి మీడియా, తలమడుగు