Champions-Trophy-2025
Champions-Trophy-2025

Champions Trophy-2025: ట్రోఫీ నుంచి ఆ రెండు జట్లు ఔట్.. సెమీస్ కు చేరిన జట్లు ఇవే

Champions Trophy-2025: రోహిత్ శర్మ(Rohith Sharma) కెప్టెన్సీలోని భారత జట్టు 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. దీంతో గ్రూప్ ‘ఏ’ నుంచి సెమీఫైనల్‌కు చేరిన రెండో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. కాగా, ఒకే గ్రూప్‌లో ఉన్న ఆతిథ్య జట్లు పాకిస్తాన్-బంగ్లాదేశ్ నిష్క్రమించాయి.

గ్రూప్ ఏ నుంచి సెమీ ఫైనల్ కు చేరే జట్లు ఫిబ్రవరి 24న ఖరారయ్యాయి. ఇందులో టీమిండియా-న్యూజిలాండ్  ఉన్నాయి. రావల్పిండిలో న్యూజిలాండ్ -బంగ్లాదేశ్ మధ్య డూ ఆర్ డై మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత్, న్యూజిలాండ్ జట్లు 2-2 తేడాతో గెలిచాయి.

ఈ ఫలితంతో  టీమిండియా -న్యూజిలాండ్ సెమీ-ఫైనల్‌కు  ఖరారయ్యాయి. వాస్తవానికి ఈ రెండు జట్లు ఇప్పటి వరకు తమ గ్రూప్‌లో 2-2 మ్యాచ్‌లు ఆడగా, రెండింట్లోనూ గెలిచాయి. మరోవైపు పాకిస్తాన్-బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఈ రెండు జట్లు చెరో మ్యాచ్ లు ఆడగా, రెండింట్లోనూ ఓడిపోయాయి.  .

దీంతో పాయింట్ల ఆధారంగా పాకిస్తాన్ -బంగ్లాదేశ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించాయి. కాగా టీమిండియా, న్యూజిలాండ్ సెమీ-ఫైనల్స్‌లోకి చేరుకున్నాయి. తొలి మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత పాకిస్తాన్ ను 6 వికెట్ల తేడాతో ఓడించింది.

ఇప్పుడు గ్రూప్-ఏలో మరో 2 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు లాంఛనంగా జరగనున్నాయి. ఈ గ్రూప్‌లోని తదుపరి మ్యాచ్ పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 27న రావల్పిండిలో జరుగనుంది. గ్రూప్‌లోని చివరి మ్యాచ్ మార్చి 2న దుబాయ్‌లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది.

రాచిన్ సెంచరీతో బంగ్లా ఓటమి

సోమవారం జరిగిన న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ ను ప్రస్తావిస్తే  టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 9 వికెట్లకు 236 పరుగులు చేసింది. జట్టు తరఫున కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో 77 పరుగులు చేశాడు. జకీర్ అలీ 45 పరుగులు సాధించాడు. కివీస్ జట్టు తరఫున మిచెల్ బ్రేస్‌వెల్ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ జట్టుకు ఓపెనింగ్ తేలిపోయింది. 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీని తరువాత, రచిన్ రవీంద్ర బాధ్యతలు స్వీకరించి డెవాన్ కాన్వేతో కలిసి 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత, రాచిన్, టామ్ లాథమ్‌తో కలిసి 136 బంతుల్లో 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

చివరకు కివీస్ ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర 105 బంతుల్లో 112 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించాడు. టామ్ లాథమ్ 55 పరుగులు, డెవాన్ కాన్వే 30 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ తరఫున తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా, ముస్తాఫిజుర్ రెహమాన్, రిషద్ హుస్సేన్ తలా ఒక వికెట్ తీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *