- దేశవ్యాప్తంగా క్రికెట్ క్రీడాభిమానుల సంబురాలు
IND vs PAK: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్తాన్‌ను దారుణంగా ఓడించింది. టీమిండియా సాధించిన అద్భుత విజయం అభిమానుల హృదయాలను ఆనందంతో నింపింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ను ఓడించింది. ఈ విజయంతో, భారత జట్టు సెమీ-ఫైనల్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. భారతదేశం సాధించిన ఈ విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.

పాకిస్తాన్‌పై ఈ అద్భుతమైన విజయం సాధించిన తర్వాత దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. క్రికెట్ ప్రేమికులు వీధుల్లోకి వచ్చి నృత్యాలు చేస్తూ, కేరింతలు కొడుతూ సంబురాలు చేసుకున్నారు.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత్ ఓడించినప్పుడు, ఒక క్రికెట్ అభిమాని, “ఇది మంచి మ్యాచ్. విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు, మేము చాలా సంతోషంగా ఉన్నాము” అంటూ అభిమానులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. “ఈ విజయం క్రెడిట్ విరాట్ కోహ్లీకే దక్కుతుందంటూ ప్రశంసించారు.