BSNL: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం చౌకగా, దీర్ఘకాలిక చెల్లుబాటు కలిగిన రీఛార్జ్ ప్లాన్(rechagre plans)లను అందిస్తోంది. రూ. 797 ధరతో అందుబాటులో ఉన్న ఈ ప్రత్యేక ప్లాన్, మొత్తం 300 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది.
రూ. 797 ప్లాన్ వివరాలు:
- చెల్లుబాటు(Validity): మొత్తం 300 రోజులు
- కాల్ సదుపాయం: మొదటి 60 రోజుల పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత ఉచిత కాలింగ్
- డేటా ప్రయోజనం: ప్రతి రోజు 2GB హై-స్పీడ్ డేటా, 60 రోజుల పాటు (మొత్తం 120GB)
- SMS సదుపాయం: రోజుకు 100 ఉచిత SMSలు, 60 రోజుల పాటు
మొదటి 60 రోజుల తర్వాత, ఉచిత కాలింగ్, డేటా, SMS సదుపాయాలు ముగుస్తాయి. అయితే, మీ సిమ్ 300 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది, ఇన్‌కమింగ్ కాల్స్ అందుకోవడానికి ఎలాంటి సమస్య ఉండదు.
ఈ ప్లాన్, ఎక్కువ కాలం సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వినియోగదారులకు, ముఖ్యంగా తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక చెల్లుబాటు కోరుకునేవారికి అనుకూలంగా ఉంటుంది.
గమనిక: ప్లాన్ వివరాలు ప్రాంతాలవారీగా మారవచ్చు. కాబట్టి, రీఛార్జ్ చేసుకునే ముందు మీ ప్రాంతీయ BSNL కస్టమర్ కేర్(Customer Care) లేదా అధికారిక వెబ్‌సైట్‌లో తాజా వివరాలను తెలుసుకోవడం మంచిది.