- ఊర్వశి థియేటర్ లో వేడుకలు నిర్వహించిన విక్టరీ అభిమానులు
Victory Venkatesh:విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) నటించిన సంక్రాంతి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమా గత నెల 14న విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. కేవలం 30 రోజుల్లో 300 కోట్ల (300 Crores)వసూలు చేసి ప్రాంతీయ చిత్రాల్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ సందర్భంగా గోదావరిఖనిలోని ఊర్వశి థియేటర్ లో విక్టరీ వెంకటేష్ అభిమానులు ఘనంగా సంబురాలు నిర్వహించారు.
కాంగ్రెస్ నాయకులు పాతపల్లి, ఎల్లయ్య బాల రాజ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై విజయోత్సవ కేక్ కట్ చేశారు. థియేటర్ మేనేజర్ నర్సింహ రెడ్డి, సిబ్బందితో పాటు పలువురిని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. మొదటి నుంచే హీరో వెంకటేష్ అంటే కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అని, ఆయన నటించిన చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే ఇంత పెద్దగా వసూలు చేయడం గొప్ప విషయం అని కొనియాడారు. ఇక ముందు కూడా ప్రేక్షకులను మెప్పించే చిత్రాల్లో నటిస్తూ మరిన్ని రికార్డులు నెలకొల్పాలని ఆకాంక్షించారు.

విక్టరీ వెంకటేష్ సీనియర్ అభిమాని మహమ్మద్ రఫీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గోదావఖని అధ్యక్షుడు ఆలకుంట రాజేందర్, అభిమానులు రామస్వామి, రాజు, కుమార్, సిద్ధూ, తల్వార్, కిషోర్, వెంకటేష్, శ్రీకర్, సంతోష్, సంజయ్, దుర్గేష్, రమేష్, వేణు, శ్రవణ్, రవి, రాంప్రసాద్, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, గోదావరిఖని