Malabar gold offers
Malabar gold offers

Malabar gold offers:వరలక్ష్మి పర్వదినానికి ‘మలబార్’ ప్రత్యేక ఆఫర్లు

వినియోగదారుల కోసం ఆకర్షణీయ తగ్గింపులు

Malabar gold offers:వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని మలబార్ గోల్డ్ & డైమండ్స్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఆభరణాల్లో విశ్వసనీయతకు చిరునామాగా నిలిచిన ఈ సంస్థ, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ఆభరణాలపై పలు పరిమితకాల ఆఫర్లను అందిస్తోంది.

ఈ పండుగ సందర్భంగా అన్ని బంగారానికి, అన్‌కట్ వజ్రాలకు, రత్నాభరణాలపై 30 శాతం తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు వజ్రాల ధరపై కూడా 30 శాతం దాకా తగ్గింపు ఇస్తున్నది. ఈ ఆఫర్లు ఆగస్టు 8 వరకు అమల్లో ఉంటాయి.

ప్రతి ఆభరణం సంప్రదాయాన్ని, నమ్మకాన్ని, శాశ్వత సౌందర్యాన్ని ప్రతిబింబించేలా ఉండేలా మలబార్ రూపొందిస్తోంది. అన్ని ఆభరణాలు 100 శాతం హెచ్‌యూఐడీ ధృవీకరణతో, 28 స్థాయిల నాణ్యత తనిఖీలతో వినియోగదారుల వద్దకు చేరుతాయి. కొనుగోలుపై ఒక సంవత్సరపు ఉచిత బీమా కూడా లభిస్తుంది. లైఫ్ టైమ్ ఉచిత నిర్వహణ, పాత బంగారం, వజ్రాలకు వంద శాతం మార్పిడి విలువ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.

భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో 400కి పైగా షోరూముల ద్వారా 15 మిలియన్లకుపైగా కస్టమర్లను ఆకట్టుకున్న మలబార్ గోల్డ్ & డైమండ్స్, 26,000 మంది ఉద్యోగులతో సేవలందిస్తోంది.

మలబార్ వజ్రాలు, బంగారం ధృవీకరించిన మార్గాల ద్వారా సేకరించబడతాయని, నైతిక విలువలు పాటిస్తూ తయారు చేయబడుతున్నాయని హామీ ఇస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారీ, నాణ్యత నియంత్రణలు పాటిస్తోందని సంస్థ వెల్లడించింది.

సమాజంలోని శాశ్వత అభివృద్ధికి కట్టుబడిన మలబార్, లాభాల్లో 5 శాతం విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ఆకలి నిర్మూలన, మహిళా సాధికారత వంటి కార్యక్రమాలకు కేటాయిస్తూ సేవలందిస్తోంది.

1993లో స్థాపితమైన మలబార్ గోల్డ్ & డైమండ్స్, మలబార్ గ్రూప్‌కు చెందిన ప్రధాన సంస్థ. వార్షికంగా 7.36 బిలియన్ డాలర్ల టర్నోవర్‌తో ఇది ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆభరణాల రిటైలర్‌గా గుర్తింపు పొందింది. డెలాయిట్ లగ్జరీ గూడ్స్ ప్రపంచ ర్యాంకింగ్‌లో 19వ స్థానాన్ని సంపాదించింది.

-శెనార్తి మీడియా, హైదరాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *