DAO inspecition
DAO inspecition

DAO inspecition: రైతులు ఆందోళన చెందవద్దు

  • జిల్లాలో సరిపడా ఎరువుల నిల్వ లు
  • జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి
  • గన్నేరువరంలో ఎరువుల దుకాణాల తనిఖీ

DAO inspecition: కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి జె. భాగ్యలక్ష్మి, మానకొండూర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (ఏడీఏ) ఎన్. శ్రీధర్, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి గన్నేరువరం మండలంలోని ఎరువుల దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సొసైటీని తనిఖీ చేశారు.

ఈ వానకాలానికి అవసరమైన ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. రైతులు అనవసరంగా ఆందోళన చెందకూడదని, అవసరానికి మించిన ఎరువులు కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ పెట్టుకోవడం మానుకోవాలని సూచించారు. అవసరానికి తగ్గట్టుగా మాత్రమే ఎరువులు తీసుకోవాలని అధికారులు రైతులను కోరారు.

-శెనార్తి మీడియా, గన్నేరువరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *