- తాండూర్ సీఐ కుమారస్వామి
Awareness Programme: యువత డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, భవిష్యత్తును మరింత్వలంగా తీర్చిదిద్దుకోవాలని తాండూర్ సీఐ కుమారస్వామి సూచించారు. శనివారం తాండూర్ మండలం అచలాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన యువకుడు దుద్దిల్ల విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
యువత భవితపై మత్తు పదార్థాల ప్రభావం…
సీఐ కుమారస్వామి మాట్లాడుతూ… యుక్తవయసులో విద్యాబుద్ధులు నేర్చుకుని, ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. అయితే, కొంతమంది యువత గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పట్టణాలకే పరిమితమైన గంజాయి.. ప్రస్తుతం పల్లెలకు విస్తరిస్తున్నదననారు . యువత మత్తుకు బానిసలై చోరీలు, దాడులు, అహితకర చర్యలు చేయడంతో పాటు, తల్లిదండ్రులను డబ్బుల కోసం వేధించడం, ఇవ్వకపోతే దాడులకు పాల్పడటం వంటి ఘటనలు పెరిగిపోతున్నాయి అని ఆయన అన్నారు. పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులే తీర్చిదిద్దాలని, వారి కదలికలపై తగినంత నిఘా ఉంచాలని సీఐ సూచించారు. పిల్లలు అతివేగంగా మారిపోతున్న ప్రస్తుత యుగంలో, తల్లిదండ్రులు వారి ప్రవర్తనను గమనించి, సరైన మార్గదర్శనం చేయాలన్నారు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ
ఈ సందర్భంగా డ్రగ్స్ రహిత సమాజం కోసం సదస్సుకు హాజరైన విద్యార్థులు, గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, తాండూర్ మండల విద్యాధికారి ఎస్. మల్లేశం, తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్, బెల్లంపల్లి డివిజన్ ఎక్సైజ్ ఎస్సై ఎం. వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి కల్పన, పాఠశాల సలహాదారులు సిహెచ్. విజయ్ కుమార్, నిర్వాహకులు దుద్దిల్ల విష్ణువర్ధన్, అభినవ సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :