FIELD VISIT : మందమర్రి మండలంలోని పొన్నారం, లేమూర్ గ్రామ శివారుల్లోని వరి పంట పొలాలను గురు వారం చెన్నూరు ఏడీఏ (ADA) బానోత్ ప్రసాద్, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు (AEO’S) ముత్యం తిరుపతి, కనకరాజులతో కలిసి పరిశీలించారు. క్షేత్ర పరిశీలనలో వరి పొలాలు చిరు పొట్ట దశలో ఉండి, అగ్గి తెగులు, కాండం తొలుచు పురుగు ఆశించినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ అగ్గి తెగులు ఆశించినప్పుడు వరి ఆకులపై గోధుమ ఎరుపు కలగలిసిన నూలు కండి ఆకారపు మచ్చలు ఏర్పడి, క్రమేణ అవి కలిసిపోయి, ఆకులు ఎండిపోతాయని అవగాహన కల్పించారు. అలాగే అక్కడక్కడ మెడ విరుపు సైతం వస్తుందన్నారు.

అగ్గి తెగులు నివారణకు ట్రీసైక్లోజోల్ (TRICYCLAZOLE) (75 WP) 120 గ్రాములు, ప్లాంటుమైసిన్ (PLANTOMYCIN) 50 గ్రాములతో కలిపి వరి పైరు పై పిచికారీ (SPRAY) చేసుకోవడం మేలని రైతులకు సూచించారు. అదే విదంగా కాండం తొలచు పురుగు నివారణకు కార్తాప్ హైడ్రోక్లోరిడ్ (CARTAP HYDROCHLORIDE) (50 శాతం SP) 250 నుంచి 400 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ (CHLORANTRANILIPROLE)(18.5 SC) 60 మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలని తెలిపారు. ఈ క్షేత్ర పర్యటన కార్యక్రమంలో రైతులు పెంచాల మధు, పెంచాల రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల వ్యవసాయం :