FOOD FESTIVAL : జిల్లాలోని నస్పూర్ మండలం తాళ్లపల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో గల మదర్స్ ప్రైడ్ పాఠశాలలో శుక్రవారం ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంఈఓ, జిల్లా పరీక్షల అధికారి దామోదర్ హాజరై మాట్లాడారు. పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాలలో రాణిస్తున్నారని, ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి వివిధ రంగాలలో రాణిస్తున్న వారిని శాలువాలతో సన్మానించారు.

ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకొని మదర్స ప్రైడ్ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు తీసుకువచ్చిన వివిధ రకాల వంటకాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రేగళ్ల ఉపేందర్, ఇంచార్జ్ స్వదీప్తి, సీతారాంపల్లి పాఠశాల హెచ్ఎం పద్మజ, నస్పూర్ మండల మెడికల్ ఆఫీసర్ సమత, కుందారం మెడికల్ ఆఫీసర్ శ్రావ్య, అభ్యాస పాఠశాల ప్రిన్సిపల్ సుధాతి, నాగపూర్ ఎంఆర్సి సభ్యులు సింధు, మహేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల :