VIVEKANADA
నృత్యాలు చేస్తున్న విద్యార్థులు

FRESHERS DAY : కళాశాలల్లో ఫ్రెషర్స్ డే సందడి

 

FRESHERS DAY : సుల్తానాబాద్‌లోని సాధన డిగ్రీ కళాశాల, వివేకానంద జూనియర్ కళాశాలల్లో శనివారం ఫ్రెషర్స్ డే సందడిగా జరిగింది. నూతన విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాన్వి డిఫెన్స్ అకాడమీ చైర్మన్ ఎర్రంశెట్టి మునీందర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చేలా చదువులో ప్రతిభ కనబరచాలని పిలుపునిచ్చారు. వివేకానంద, సాధన కళాశాలల్లో చదివే విద్యార్థులకు కరీంనగర్‌లోని శాన్వి అకాడమీలో ఉచిత శిక్షణ కల్పిస్తామని తెలిపారు.

SAANVI

ఈ కార్యక్రమంలో వివేకానంద పాఠశాల చైర్మన్ భూసారపు బాలకిషన్ ప్రసాద్, సాధన డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ ఎర్రంశెట్టి మునీందర్, వివేకానంద విద్యాసంస్థల డైరెక్టర్లు ఉమారాణి, రవీందర్, పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత, సాధన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వేముల కిరణ్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భూసారపు సాయికిరణ్, వైస్ ప్రిన్సిపాల్ రజిత పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను కళాశాల యాజమాన్యం సన్మానించింది. వివేకానంద విద్యాసంస్థల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, సుల్తానాబాద్ :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *