WOMENS CI
మాట్లాడుతున్న మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరేశ్

AWARENESS SEMINAR : చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలి

  • మహిళా పోలీస్ స్టేషన్ సీఐ నరేశ్

AWARENESS SEMINAR : యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులై మంచి భవిష్యత్తును కోల్పోవద్దని మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ (WOMEN POLICE STATION) సీఐ (CI) నరేశ్ అన్నారు. బుధ వారం మంచిర్యాల పట్టణంలోని రాజీవ్‌నగర్ తెలంగాణ మోడల్ స్కూల్ (MODEL SCHOOL) & జూనియర్ కాలేజీ (JUNIOR COLLEGE)లో “యాంటీ డ్రగ్ సోల్జర్ (ANTI DRUG SOLDIER)”, “షీ టీమ్ (SHE TEAM)” సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత మాదకద్రవ్యాల బానిసలుగా మారకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ సుస్థిరమైన భవిష్యత్తు కోసం సరైన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కుటుంబం, సమాజం, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు.

SHE TEAM SI
మాట్లాడుతున్న షీ టీమ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ హైమ

మహిళల రక్షణకు షీ టీం అండా – షీ టీమ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ హైమ

తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణకు “షీ టీమ్”(SHE TEAM)ను ఏర్పాటు చేసిందని షీ టీమ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (SI) హైమ అన్నారు. షీ టీం సేవలు ప్రతి మహిళకు అందుబాటులో ఉంటాయని, మహిళలు, యువతులు ఎక్కడైనా వేధింపులు, భద్రతా సమస్యల విషయంలో ఇబ్బందులు పడుతున్న సందర్భాలలో షీ టీమ్ వాట్సాప్ నెంబర్ (WHATS UP NUMBER – 63039 23700) ద్వారా నేరుగా సంప్రదించవచ్చని సూచించారు. షీలకు రక్షణగా మా టీం ఉంటుందని దైర్యాన్ని కల్పించారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ అవగాహన కల్పించారు.

STUDENTS
హాజరైన విద్యార్థులు

మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు డీ సరిత, ఎం సుమ, సుజాత, అరుణ, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *