కేశవపట్నం ఎస్‌ఐ శేఖర్ రెడ్డి
Lokadalath: “చట్టసమ్మతమైన రీతిలో వివాదాలను పరిష్కరించడం లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశమని కేశవపట్నం పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ కె.శేఖర్ రెడ్డి తెలిపారు.
సెప్టెంబర్ 13, 2025న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌లో కేసులను రాజీ పరచుకునేందుకు ఇరువర్గాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. సెప్టెంబర్ 1 నుండి 13 వరకు కేసులు రాజీపడే అవకాశం ఉందని తెలిపారు.
రాజీతో ప్రయోజనం
ఫిర్యాదిదారు, ముద్దాయి ఇద్దరూ పరస్పర అంగీకారంతో చట్టపరంగా వివాదాలను పరిష్కరించుకోవచ్చని ఎస్‌ఐ అన్నారు. చిన్నచిన్న కేసుల కారణంగా జీవితాలను నాశనం చేసుకోవడం కంటే, కుటుంబ సభ్యులు, గ్రామం లేదా పట్టణంలో నివసించే వారు సఖ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
“జీవితంలో కలిసిమెలిసి ఉండేందుకు రాజీ మార్గమే రాజమార్గం. జాతీయ లోక్ అదాలత్ వంటి వేదికను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి” అని శేఖర్ రెడ్డి సూచించారు
-శెనార్తి మీడియా, శంకరపట్నం
