land mafia
land mafia

Land Mafia : భూ కబ్జాదారుల దౌర్జన్యం

బుదాకూర్దు గ్రామంలో ముదురురతున్న భూ వివాదం

Land Mafia : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని బుదాకూర్దులో భూ వివాదం చెలరేగుతోంది. సర్వే నంబర్ 70లోని రెండెకరాల భూమి తమదని ఒక వర్గం చెబుతుండగా, మరో వర్గం సర్వే నంబర్ 135/2లోని కేవలం 32 గుంటల పట్టా పాసు పుస్తకాన్ని చూపిస్తూ ఆ రెండెరాలు తమవేనని వాదిస్తున్నారు.

భూ కబ్జాదారులు తమకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న బంధువుల ముందు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై వారు గతంలోనే రామగుండం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, విచారణ చేపట్టిన రూరల్ సీఐ, ఎస్ఐ చర్యలు తీసుకోవడంలో అలసత్వం చూపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

83 సార్లు దరఖాస్తులు ఇచ్చినా న్యాయం దక్కలేదంటున్న బాధితులు

ఈ భూ వివాదంపై బాధితులు మండల మేజిస్ట్రేట్, జిల్లా మేజిస్ట్రేట్, రాష్ట్ర ముఖ్యమంత్రి, సీసీఎల్‌ఏ సీఎస్ అధికారులకు ఇప్పటివరకు 83 దరఖాస్తులు సమర్పించారు. ప్రజావాణి, ప్రజాదర్శన కార్యక్రమాల్లోనూ పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఇప్పటికీ న్యాయం దక్కలేదని వాపోతున్నారు.

ధరణి పోర్టల్ లోపాలపై ఆగ్రహం

ధరణి పోర్టల్‌లోని కడాస్ట్రల్ మ్యాప్‌లో అన్ని రహదారులు, చెరువులు, పంట పొలాలు సరిగానే ఉన్నప్పటికీ, తమ భూమి మ్యాప్ మాత్రమే తప్పుగా ఉందని గ్రామంలోని రాజకీయ నాయకులు చెప్పడం బాధితులను మరింత కలవరపెడుతున్నది. ప్రజల సొమ్ముతో అభివృద్ధి చేశామని చెప్పే బీఆర్ఎస్ నాయకులు భూ వివాదాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

రెవెన్యూ, పోలీస్ శాఖల వైఖరిపై విమర్శలు
“ప్రైవేట్ భూముల విషయంలో మేమేం చేయలేం. ప్రభుత్వ భూములకు మాత్రమే మేము రక్షణ కల్పిస్తాం,” అని రెవెన్యూ, పోలీస్ అధికారులు చెప్పడం బాధితులను నిరాశకు గురిచేస్తున్నది. అధికారుల అలసత్వం కారణంగా భూ వివాదం ముదరుతోందని, బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

భూ మాఫియాకు అడ్డుకట్ట వేయాలి
తెలంగాణ ప్రజలు భూములు కొనుగోలు లేదా విక్రయించాలంటే ధరణి పోర్టల్‌లోని కడాస్ట్రల్ మ్యాప్‌ని చూసి నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో భూ కబ్జాదారులు అధికారుల సాయంతో భూములను కబ్జా చేయడం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు, బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *