RATION
తనిఖీ చేస్తున్న తహశీల్దార్, డీటీలు

RATION SHOP SEIZED : రేషన్ షాపు సీజ్

RATION SHOP SEIZED :  మంచిర్యాల జిల్లా  కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీలోని రేషన్ షాపు (నెంబర్ 15)ను రెవెన్యూ అధికారులు గురు వారం సీజ్ చేశారు. షాపులో ఉండాల్సిన కోటా కంటే అధికంగా బియ్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం అందడంతో గురు వారం తహశీల్దార్ రఫాతుల్లా హుస్సేన్, డిప్యూటీ తహశీల్దార్ మధుసూదన్ లు సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. కేటాయించిన కోటా కంటే అధనంగా తొమ్మిది క్వింటాళ్ల బియ్యం అధనంగా ఉండటంతో షాపును సీజ్ చేయడంతో పాటు డీలర్ గద్దల వెంకటస్వామిపై కేసు నమోదు చేశారు. వీరి వెంట ఆర్ఐలు ఆజీజ్, స్వప్న, సీనియర్ అసిస్టెంట్ సంజీవ్ పాల్గొన్నారు.

 

– శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *