Teachers Demands : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని గురువారం జిల్లా విద్యాశాఖ అధికారికి రాష్ట్రోపాధ్యాయ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలపై చర్చించారు. జిల్లాలో చలి తీవ్రత దృష్ట్యా విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాఠశాల సమయాన్ని ఉదయం 9.40 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మార్చాలని కోరారు.
రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయి పెండింగ్ లో ఉన్న ఎస్ జి టీ, ఎల్ పి, పీ ఈ టీ, ఎస్ ఏల రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్ వెంటనే జారీ చేయాలని కోరారు. అలాగే మెడికల్ రీయంబర్స్ మెంట్ ప్రపోజల్స్ ను త్వరితగతిన జిల్లా మెడికల్ బోర్డుకు పంపించాలని, వేసవి సెలవుల్లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ కు సంబంధించిన ఈ ఎల్ ప్రిసర్వేషన్ ప్రొసీడింగ్ ను జారీ చేయాలన్నారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి, మరమ్మత్తుల పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించాలని కోరారు.
అంతకుముందు మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్యను మర్యాదపూర్వకంగా శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రోపాధ్యాయ సంఘం మంచిర్యాల జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భట్టారి వెంకటేశ్వర్లు, చీపెల్లి బాపు, సీనియర్ సంఘ నాయకులు, రిటైర్డ్ ఉప విద్యాధికారి పీ ఏ వి ఎన్ చారి , మాజీ ఎస్ టీ యు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోకల వెంకటేశ్వర్లు , బీసగౌని శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు పద్మ , మన్మోహన్, ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ, అదనపు ప్రధాన కార్యదర్శి సుమన్, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
