
Ugadi Celebrations: శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాలలోని ఎమ్మెల్యే నివాసంలో వేడుకలు జరిగాయి. వేడుకల్లో భాగంగా ముందుగా దేవతా పూజలు చేశారు. ప్రజలందరికీ శుభం కలగాలని, వారి జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని ఎమ్మెల్యే పీఎస్సార్ ఆకాంక్షించారు. అనంతరం ఆయన ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, డీఎఫ్ఓ ఆశిష్ సింగ్, పోలీసు అధికారులు, కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

శెనార్తి మీడియా, మంచిర్యాల:
