rohit-sharma-and-virat
rohit-sharma-and-virat

Ind vs Ban Live: ఇండియా వర్సెస్ మ్యాచ్ లైవ్.. ఇలా ఫ్రీగా చూడొచ్చు

 

Ind vs Ban Live: టీం ఇండియా ఈ నెల 20 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నది. ఈ ఐసీసీ టోర్నమెంట్‌లో గురువారం రెండో మ్యాచ్ జరగనున్నది. ఇందులో ఇండియా, బంగ్లాదేశ్ జట్లు పరస్పరం తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకమైనది. ముఖ్యమైనది, ఎందుకంటే ఇక్కడ ఓటమి చెందితే మొత్తం టోర్నమెంట్ నుంచే నిష్క్రమించాల్సి వస్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మ దీనిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాడు. అయితే ఈ డై అండ్ నైట్ మ్యాచ్‌ను మీ టీవీ లేదా మొబైల్‌లో ఉచితంగా ఎలా చూడవచ్చో తెలుసుకుందాం. మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతంది.. టాస్ సమయం ఏమిటో కూడా తెలుసుకోండి.

టీం ఇండియా తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతున్నది, మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో, టీం ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడనున్నది. భారతదేశం-బంగ్లాదేశ్ జట్లు ప్రస్తుతం దుబాయ్‌(Dubai)లో ఉండటానికి ఇదే కారణం. రెండు రోజులుగా టీం ఇండియా తన సన్నాహాలకు తుది మెరుగులు దిద్దుతున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటగాళ్లందరితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. అలాగే అనుసరించిన వ్యూహాలపై జట్టు సభ్యులతో చర్చిస్తున్నారు.

ఈ రోజు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు భారత జట్టు ప్లేయర్లందరికీ ఈ రోజే పరీక్షలాంటిదే. ఇక ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది. అరగంట ముందు అంటే మధ్యాహ్నం రెండు గంటలకు టాస్ వేయనున్నారు .ఏ జట్టు టాస్ గెలుస్తుందో చూడాలి. టాస్ సమయంలో, ఇరు జట్లు నేటి మ్యాచ్‌కు తమ తుది జట్టును వెల్లడిస్తాయి.

ఇండియా vs బంగ్లాదేశ్ మ్యాచ్‌ను ఇలా ప్రత్యక్షంగా చూడవచ్చు.
ఇండియా vs బంగ్లాదేశ్ మ్యాచ్ ని లైవ్ ని టీవీలో స్టార్ స్పోర్ట్స్(Star Sports1) 1 లో మ్యాచ్ చూడవచ్చు. ఇది కాకుండా స్పోర్ట్స్ 18లో కూడా మ్యాచ్ ప్రసారమవుతుంది. రెండు ఛానెళ్లలోనూ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అలాగే, మీరు మీ మొబైల్‌లో మ్యాచ్ చూస్తుంటే లేదా స్మార్ట్ టీవీ ఉంటే, దాని కోసం మీరు జియో హాట్ స్టార్‌కి వెళ్లాల్సి ఉంటుంది. గతంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌గా ఉన్న యాప్ ఇప్పుడు జియో హాట్ స్టార్‌గా మారింది. దీంతో పెద్దగా సమస్య ఉండదు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇప్పుడు ముగిసింది. మీరు జియో సినిమాలో మ్యాచ్ చూడలేరు. మ్యాచ్ సమయంలో కామెంట్రీ వినడానికి ఏ భాషను అయినా ఎంచుకోవచ్చు. దీని కామెంట్రీ అనేక భాషలలో జరుగుతోంది.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్.

బంగ్లాదేశ్ జట్టు: సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), జకార్ అలీ (వికెట్ కీపర్), ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, నహిద్ రాణా, ముస్తాఫిజుర్ రెహమాన్, తౌహీద్ హృదయ్, రిషద్ హొస్సేన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, నసుమ్ అహ్మద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *