- భీమారం మండల వ్యవసాయాధికారి సుధాకర్
MAO INSTRUCTIONS : పెసరలో రసం పీల్చే పురుగులను ముందుగానే గుర్తించడం వల్ల నష్టాన్ని అధికమించవచ్చునని భీమారం మండల వ్యవసాయ అధికారి (MAO) అత్తే సుధాకర్ సూచించారు. మంగళ వారం మండలంలోని ఖాజీపల్లి, అంకుషాపూర్ శివారులలోని పెసర, వరి పంట క్షేత్రాలను సందర్శించిన అనంతరం రైతులకు పలు సూచనలు చేశారు. పెసరలో రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడా క్లోప్రిడ్ (IMIDACLOPRID) 1 మిల్లీ లీటరు (ml) లీటరు ( Ltr) నీటికి కలిపి స్ప్రే (SPRAY) చేయడం ద్వారా నివారించుకోవచ్చునని లేదా అసిఫేట్ 1.5 గ్రాములు (grms) లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చునన్నారు. అంతేకాకుండా వరిలో జింక్ (ZINK) లోపం అధికంగా ఉందని, దీని నివారణకు ఎకరానికి 100 గ్రాములు (grms) చెలామిన్ జింక్ (CHELAMIN ZINK) ( 12 శాతం EDTA )ను 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచ్చికారి చేయడం ద్వారా జింక్ (ZINK) లోపాన్ని అరికట్టవచ్చన్నారు. ఎంఏఓ (MAO) వెంట వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) అరుణ్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :