- రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్
- కమిషనరేట్ కు మూడు పోలీస్ జాగిలాలు…
Trained Dogs: నేరాల నియంత్రణలో, నార్కోటిక్, ఎక్స్‌ప్లోసివ్ గుర్తింపు లో పోలీస్ జాగిలాల పాత్ర చాలా కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో ఏడాది పాటు శిక్షణ పొందిన 24వ బ్యాచ్‌కి చెందిన జాగిలాలు శుక్రవారం పాసింగ్ అవుట్ (Passing Out Parade) పూర్తి చేసుకున్నాయి. ఇందులో మూడు జాగిలాలు నార్కొటిక్ డాగ్ (జెస్సి) గంజాయి, మత్తు పదార్థాల గుర్తింపు లో, స్నిపర్ డాగ్ (రైడర్) ఎక్స్ ప్లోజివ్ గుర్తింపు లో, ట్రాకర్ డాగ్ (టైసన్) వివిధ రకాల నేరాలకు పాల్పడిన నిందితులను గుర్తించడం ప్రత్యేక శిక్షణ పొందాయి. వీటిని రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు శనివారం పంపించారు. డాగ్స్ , డాగ్స్ హాండ్లర్స్ శనివారం రామగుడం సీపీని మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడారు . నేరాల నియంత్రణలో పోలీసులకు జాగిలాలు ఎంతో సహకరిస్తాయని అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరం జరిగిన చోట పరిసరాల్లో వాసన చూసి నిందితులు, అనుమానితులను, నేరస్తులను త్వరగా గుర్తించడానికి జాగిలాలను ఉపయోగించడం జరుగుతుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి పట్టుకోవడంలో, ఎక్స్‌ప్లోజివ్స్, బాంబులను గుర్తించిన విధంగానే డ్రగ్స్, గంజాయిని ట్రేస్ చేసేందుకు ఈ నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ కీలక పాత్ర ఉంటుందని సీపీ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ రాజు, ఏ ఆర్ ఏసీపీ పి ప్రతాప్, ఆర్ ఐ లు వామనమూర్తి, శ్రీనివాస్,మల్లేశం, సంపత్, సీసీ హరీష్, తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల / గోదావరిఖని :