- ముగ్గురు పట్టివేత.. ఐదుగురు పరారీ
Police Attack : కాసిపేట మండలంలోని వరిపేట గ్రామ శివారులో గల చెట్ల పొదల్లో కొనసాగుతున్న పేకాట స్థావరంపై గురువారం సాయంత్రం రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్సై లచ్చన్నల ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేయడంతో పేకాట ఆడుతున్న కణుకుల తిరుపతి (సోమ గూడెం), నవనందుల వెంకటేష్ (బుగ్గ గూడెం), అక్కనపల్లి లక్ష్మీపతి (తంగళ్ళపల్లి) లు పట్టుబడ్డారు. ఈ సంఘటనలో పత్తిపాక ప్రవీణ్ (వరి పేట), గుండ్ల సంతోష్ (బుగ్గ గూడెం), ఎదల తిరుపతి (బుగ్గ గూడెం), గుండ రాజేందర్ (బుగ్గ గూడెం), సాయి (సోమ గూడెం) అనే ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పరారయ్యారు. వీరి వద్ద నుండి పోలీసులు రూ 7,650 నగదు స్వాధీనం చేసుకుని కాసిపేట పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల