Help Society: రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతున్న సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని అనాధలకు గురువారం హెల్ప్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేశారు. పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్, ఐబి చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా తదితర ప్రాంతాలలో భిక్షాటన చేస్తూ జీవించే వారికి, అనాధలకు మంచిర్యాల ఏఎస్ఐ సత్తయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ సొసైటీ ఫౌండర్ సైమన్, కళ్యాణ్, ప్రసాద్, శ్రీనివాస్, రాగ మాలిక తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల