- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు
Rains In Telangana : తెలంగాణలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడుతున్నాయి.
హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురుస్తోంది. మరో కొన్ని గంటలపాటు వర్షం కొనసాగనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచించారు.
ఈ అకాల వర్షాలు రైతులపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మామిడి రైతులకు ఈదురు గాలులతో కూడిన వర్షం భారీగా నష్టాన్ని కలిగించే అవకాశముంది. ప్రభుత్వ సహాయ చర్యలపై రైతులు ఎదురుచూస్తున్నారు.
– శెనార్తి మీడియా, హైదరాబాద్
