Acb Raides
Acb Raides

ACB Raides:ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్

ACB Raides: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు ప్రభుత్వ ఉద్యోగుల్లో కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ మరో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ ఓ వ్యక్తి నుంచి ₹5వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు ఆధారాలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ మధు (ACB DSP Madhu) , సీఐలు కిరణ్ రెడ్డి, స్వామి సిబ్బంది పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, ఆదిలాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *