- దళితబంధు లబ్ధిదారుల నుండి విరాళ
ANOTHER CHANCE KCR AS CM : కేసీఆర్ పాలన కోసం ప్రజలు మళ్లీ ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ 25వ రజతోత్సవ సభ కోసం దళితబంధు లబ్ధిదారులు రూ.2 లక్షలు (TWO LAKH RUPEES) విరాళంగా అందజేశారని తెలిపారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో తనకు అప్పగించారని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా దళితబంధు పథకాన్ని తెలంగాణలో అమలు చేసిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. గత పదేళ్ల పాలనలో (Ten years of rule) అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకొని కేసీఆర్ (KCR) పనిచేశారని ఆయన మళ్లీ సీఎం కావాలన్నది ప్రజల ఆకాంక్షగా చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాముకుంట్ల భాస్కర్, నీరటి శ్రీనివాస్, చింటూ, శ్రవణ్, కొర్రీ ఓదెలు, కోడి రామకృష్ణ, అయిత నాగరాజు, రొడ్డ లక్ష్మి, శాంతలక్ష్మి, హరికృష్ణ పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, గోదావరిఖని :