PSR Mass Warning
PSR Mass Warning

PSR Warning: వేదికపై నుంచే పీఎస్సార్ స్వీట్ వార్నింగ్

  • మంత్రి శ్రీధర్ బాబును మాట్లాడేందుకు ఆహ్వనిస్తుండగా  మైక్ అందుకున్న కొక్కిరాల
  • సారీ ఫర్ ది డిస్టబెన్స్ అంటూ  హెచ్చరికలు
  • ఉమ్మడి ఆదిలాబాద్ గళాన్ని నేను
  • ఆ పార్టీ, ఈ పార్టీ అని తిరిగేటోళ్లకు పదవులు ఇస్తే ఊరుకోం
  • షాక్ అయిన మంత్రులు, కాంగ్రెస్ శ్రేణులు
  • కొక్కిరాలకు మద్దతుగా అనుచరుల నినాదాలు

PSR Warning:అంతా అనుకున్నట్లుగానే జరిగింది. పీఎస్సార్ లోని ఒరిజినల్ క్యారెక్టర్ మరోసారి బయటకు వచ్చింది. ఇప్పటి వరకు జిల్లా వాసులకే పరిచయమున్న తన వైఖరి ఏకంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో మంత్రులకు సైతం  పరిచయం చేశాడు.  అంతటితో ఆగలేదు. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే ఊరుకునేదే లేదని కాంగ్రెస్ పెద్దలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. సభా వేదికపై మీద మాట్లాడేందుకు మంత్రి శ్రీధర్ బాబును డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆహ్వానిస్తుండగా, సారీ ఫర్ ది డిస్టబెన్స్ అంటూ పీఎస్సార్ మైక్ అందుకున్నాడు. తనదైన రీతిలో వేదికపై నుంచే కాంగ్రెస్ పెద్దలకు వార్నింగ్ ఇచ్చాడు.
మంత్రి పదవిని పక్కన పెట్టిన, గళాన్ని కాదు…! మంత్రివర్గంలో తనకు అవకాశమివ్వకపోతే ఊరుకోబోనని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరా ప్రేం సాగర్ రావు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు . అధిష్టానం తనకు  అన్యాయం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పట్టించుకోకపోతే, తీవ్ర పరిణామాలు తప్పవు అంటూ ‘జై బాపూ, జై భీమ్, జై సంధాన్’  అంటూ సభ వేదిక పై నుంచి హెచ్చరికలు జారీ చేశారు.

వేసవి ఎండలకన్నా మండిపోతూ…
వేరే పార్టీల్లో తిరిగి వచ్చిన వాళ్లకే పదవులా..? పార్టీకి పదేళ్లు వెన్నుదన్నుగా నిలిచిన నాకు మాత్రం బహుమతి ఇదేనా..? కాంగ్రెస్‌కు ఊపిరి పోసిన సభ నిర్వహించినా గుర్తించరా..? ఆదివాసీలకు, కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకుడిని అణచివేయాలని చూస్తారా..? అంటూ ఘాటుగా ప్రశ్నలు సంధించారు.

సభ పేరుతో ‘వార్నింగ్’ స్పష్టం..
అధిష్టానంపై అసంతృప్తిని వెలిబుచ్చిన ప్రేం సాగర్… మళ్లీ మంత్రి పదవి చర్చను జిల్లా వ్యాప్తంగా రాజేశారు. మంత్రి పదవిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత హీట్ ను పెంచాయి.  ఎవరికి మంత్రిపదవి అనే అనుమానాలు నడుస్తున్న వేళ… ప్రేం సాగర్ స్పష్టమైన వార్నింగ్ జారీ చేయడం గమనార్హం. పార్టీలో అంసతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.  మంత్రి వర్గ విస్తరణ అంటూ వస్తున్న ఊహాగానాలవేళ పీఎస్సార్ వ్యాఖ్యలు ఎటువైపు దారి తీస్తాయో అనే ఉత్కంఠ కూడా నెలకొంది.

మీడియాపై అసహనం

తాను చేపడుతున్న అభివృద్ధి పనులకు  మీడియాలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం  లేదని ఇప్పటి దాకా  ప్రెస్ మీట్లలో చెబుతూ వచ్చిన పీఎస్సార్ ఈ సారి ఏకంగా సభ పై నుంచే తన అసహనం ప్రదర్శించాడు. వేదికపై నుంచే వాడొకడు రాస్తున్నడంటూ  ఓ పత్రిక పేరును చెబుతూ  తన అసహనాన్ని వెల్లగక్కారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *