EXCISE CI
మాట్లాడుతున్న ఎక్సైజ్ సీఐ గురువయ్య

APPLICATIONS : బార్ కు దరఖాస్తుల ఆహ్వానం

 

APPLICATIONS : మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఖాళీగా ఉన్న ఒక నూతన బార్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నామని మంచిర్యాల ఎక్సైజ్ సీఐ (EXCISE CI) గురువయ్య కోరారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఒక నూతన బార్ కి దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు. 2005 ఎక్సైజ్ నిబంధనల ప్రకారం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన 25 బార్ ల స్థానంలో కొత్త బార్ (NEW BAR) లకు అనుమతి ఇవ్వగా, మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఒక బార్ ఉందన్నారు.

దరఖాస్తు రుసుముగా లక్ష రూపాయలు కాగా ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకునే అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్ ( https://tgbcl.telangana.gov.in)లో సందర్శించవచ్చునని సూచించారు. ఆసక్తి గల వారు దరఖాస్తులను ఈ నెల 26లోపు కలెక్టరేట్ లోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో సమర్పించాలన్నారు.

గడువులోపు దరఖాస్తుకు అవకాశం
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఒకే ఒక్క బార్ (BAR) కోసం ఆసక్తి గల వారు గడువులోపు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని మంచిర్యాల ఎక్సైజ్ సీఐ గురవయ్య కోరారు. దరఖాస్తు ఫారం ఏ-1కు మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ లేదా పాన్ కార్డు జిరాక్స్ లను జతపరచాలన్నారు. దరఖాస్తు రుసుము రూ.1 లక్ష( నాన్ రిఫండ బుల్)తో డీడీ తీయాలని, పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను ఈ నెల 26న సాయంత్రం 5 గంటల్లోగా మంచిర్యాల లేక ఆదిలాబాద్ లేక హైదరాబాద్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయాల్లో అందజేయాలని, ఈ నెల 29న జిల్లా కలెక్టర్ (COLLECTOR) ఆధ్వర్యంలో లాటరీ విధానం ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. వివరాల కోసం జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి (87126 58773), మంచిర్యాల ఎక్సైజ్ సీఐ (87126 58788)లలో సంప్రదించవచ్చునని సూచించారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *