SCCL SCHOOL
సింగరేణి కాలరీస్ హై స్కూల్

SINGARENI : సింగరేణి విద్యావ్యవస్థలో కొత్త ఒరవడి

  • సీబీఎస్ఈ పాఠశాల దిశగా తొలి అడుగు

SINGARENI : సింగరేణి కార్మికుల పిల్లలకు సెంట్రల్ సిలబస్ తో కూడిన విద్యను అందించాలనే సీఎండీ లక్ష్యానికి మొదటి అడుగు పడినట్లు అయింది. రామగుండం – 2 ఏరియా లోని సెక్టార్ – 3 సింగరేణి హై స్కూల్కు సి బి ఎస్ ఈ బోధనా కు సెంట్రల్ బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ శాఖ నుంచి అనుమతి రావడమే నిదర్శనంగా చెప్పవచ్చు.

సింగరేణి ప్రాంతంలో కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఆశయం చివరికి నెరవేరింది. రామగుండం-2 ఏరియాలోని సింగరేణి హైస్కూల్, సెక్టర్-3లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోధనకు కేంద్ర అనుమతి లభించింది. సంవత్సరాలుగా స్థానికంగా ఉన్నత ప్రమాణాల విద్యపై ఆశతో ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు ఇది శుభవార్తగా మారింది.

APPROVAL LETTER
అప్లియేషన్ లెటర్

గత ఏడాది నుంచి …

సింగరేణి విద్యాసంస్థల ప్రమాణాలను మెరుగుపర్చే దిశగా సింగరేణి యాజమాన్యం గత ఎడాది నుంచి ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది . పాఠశాలలో అర్హత గల బోధనాసిబ్బంది, సదుపాయాలతో కూడిన తరగతిగదులు, ఆధునిక ల్యాబ్‌లు, విశాలమైన క్రీడా మైదానాలు వంటి వసతులు ఉండటంతో సీబీఎస్ఈ బోధన కోసం కేంద్ర బోర్డును ఒప్పించడం మొదలు పెట్టింది. 2024 డిసెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో సీబీఎస్ఈ బృందం పరిశీలించింది. ప్రతి కోణంలో పాఠశాల ఉత్తమంగా ఉందని నిర్ధారించిన అనంతరం, ఏప్రిల్ 19న అధికారికంగా మంజూరు చేసింది. అప్లియేషన్ నంబర్( 3630560)తో కూడిన ధ్రువీకరణ పత్రం అందజేసింది.

CMD
మాట్లాడుతున్న సీఎండీ బలరాం నాయక్

2025-26 నుంచి సిబిఎస్ఈ తరగతులు ప్రారంభం : బలరాం నాయక్ సింగరేణి సీఎండీ

ఈ విద్యాసంవత్సరం (2025-2026) నుంచి రామగుండం – 2 రీజియన్ లోని సెక్టార్ – 3 సింగరేణి పాఠశాలలో సి బి ఎస్ ఈ తరగతులు ప్రారంభిస్తున్నం. ఒకటి నుంచి 8 వరకు సీబీఎస్ఈ తరగతులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దీంతో స్థానిక సింగరేణి కార్మికుల పిల్లలకు మెరుగైన భవిష్యత్తుకు నాంది పలికే అవకాశం ఏర్పడనుంది. విద్య రంగంలో సింగరేణి పాఠశాలలకు తిరిగి పూర్వ వైభవం రానుంది.

– శెనార్తి మీడియా, సింగరేణి ప్రతినిది :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *