శాలువాతో బండి సంజయ్ని సత్కరించిన జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్
శాలువాతో బండి సంజయ్ని సత్కరించిన జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్

GRAND WELCOME : బండి సంజయ్‌కు చెన్నూరులో ఘన స్వాగతం

 

GRAND WELCOME : కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సరస్వతీ నది పుష్కరాలకు కాలేశ్వరం వెళ్తున్న సందర్భంగా చెన్నూరు వద్ద భాజపా జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ (BJP Dist. President Nagunuri Venkateswar) ఘన స్వాగతం పలికారు. అనంతరం బండి సంజయ్‌ను పుష్పగుచ్ఛము ఇచ్చి, శాలువాతో సన్మానించారు. సందర్భంగా నగునూరి వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. బండి సంజయ్ బిజీ షెడ్యూల్ కారణంగా చెన్నూరు పట్టణానికి రాలేకపోయారని, త్వరలో జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి, ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తుమ్మ శ్రీపాల్, బుర్ర రాజశేఖర్, రాపర్తి వెంకటేశ్వర్, బత్తుల సమ్మయ్య, జాడి తిరుపతి, గర్రెపల్లి వెంకట నరసయ్య, ఏవీఎం శ్రీనివాస్, ఆలం బాబు, ఏతం శివకృష్ణ, కొరకోప్పుల వంశి, పున్నం చంద్, రాజేష్, మంచాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *