INSPECTION : కరీంనగర్ జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు, ఫెర్టిలిటీ కేంద్రాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. స్కానింగ్ కేంద్రాల్లో అవుట్ పేషెంట్ రిజిస్టర్ లు, పి.సి.పి.ఎన్.డి.టి జిల్లా అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, డాక్టర్ల అర్హతలు, గర్భస్థ లింగ నిర్ధారణ నిరోధక చట్టం (1994) అమలుతో పాటు, అనుమతులు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు.

గర్బస్థ శిశువుగా ఉన్నప్పుడూ లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధితమని, ఉల్లంఘించిన వారికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధించబడుతుందని డీఎంహెచ్ఓ (DM&HO) డాక్టర్ వెంకట రమణ హెచ్చరించారు. కేంద్రాల్లో నిబంధనల ప్రకారం బోర్డులు ప్రదర్శించడాన్ని కూడా పరిశీలించారు. స్కానింగ్ కేంద్రాలలో కచ్చితంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ధరల పట్టిక, సరైన రికార్డుల నిర్వహణ ఉండాలని, ప్రతి నెల జరిగే స్కానింగ్ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయానికి పంపిస్తున్న తీరును పరిశీలించారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని డీఎంహెచ్ఓ హెచ్చరించారు.

ఈ తనిఖీల్లో డీఎంహెచ్ఓ (DM&HO) డాక్టర్ వెంకటరమణతో పాటు పి.ఓ. డి.టి.టి. (PO DTT) డాక్టర్ ఉమాశ్రీ,, పి.సి.పి.ఎన్.డి.టి (PCPNDT) ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ సనా జవేరియా, సఖి కన్సల్టెంట్ డి. లక్ష్మి, డాటా ఎంట్రీ ఆఫరేటర్ కె. రమేశ్, డెమో (DEMO) రాజగోపాల్, ఎ.ఎస్.ఐ (ASI) విజయమాణి, ఎన్.జి.ఓ. (NGO) సభ్యులు సిస్టర్ సిరెల్, సూపర్ వైజర్లు సయ్యద్ సబీర్, ఎజాజ్ పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, కరీంనగర్ :