- పనులు పూర్తయితే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
- మాజీ ఎంఎల్ఏ నడిపెల్లి దివాకర్ రావు
- సామాజిక ఆరోగ్య కేంద్రం పనులను పర్యవేక్షించిన నాయకులు
VISIT : బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలోనే లక్షెట్టిపేటకు 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) మంజూరైందని మంచిర్యాల మాజీ ఎంఎల్ఏ (Ex-MLA) నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. గురు వారం మంచిర్యాల నియోజక వర్గంలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీలో నిర్మాణమవుతున్న సామాజిక ఆరోగ్య కేంద్రం (హాస్పిటల్) పనులను బీఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మంచి వైద్యం అందాలనే లక్ష్యంతో విషయాన్ని అప్పుడు ఎంఎల్ఏగా ఉన్న నేను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆసుపత్రి మంజూరు చేశారన్నారు.

ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ప్రజలకు ఆరోగ్య సేవలు అందుతాయన్నారు. వృద్ధులకు, పిల్లలకు, బీహెచ్ పేషెంట్లకు అందించే ఆరోగ్య సేవలు ఇప్పుడు మరింత సులభం అవుతాయన్నారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, లక్షెట్టిపేట మున్సిపల్ మాజీ ఛైర్మన్ నల్మాస్ కాంతయ్య, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ తిప్పని లింగయ్య, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులున్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :
