శెనార్తి మీడియా కథనానికి స్పందన
మంచిర్యాల జీజీహెచ్ సందర్శన
MNCL: సర్కారు దవాఖానకు వెళ్తున్నారా.. బెడ్ షీట్లు తీసుకెళ్లండి శీర్షికన ’శెనార్తి మీడియా‘లో ప్రచురితమైన కథనాలకు మంచిర్యాల జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించారు. మంచిర్యాల జీజీహెచ్ లో సరిపడా బెడ్ షీట్లు ఉన్నాయని వెల్లడించారు. మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన (Govt Hospital) ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Kumar Deepak) సోమవారం ఉదయం సందర్శించారు. దవాఖాన అంతా కలియ దిరిగి పరిసరాలను పరిశీలించారు. వార్డులను సందర్శించి పెషంట్లతో మాట్లాడారు. వైద్య సేవలు, కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

https://epaper.shenarthimedia.in/clip/319
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో బెడ్ షీట్లు లేవనే విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ప్రస్తుతం పెషంట్లకు సరిపడా బెడ్ షీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరికొన్నింటిని కూడా ఆర్డర్ పెట్టామని చెప్పారు.
పాత భవనంలో కొనసాగుతుందన్నారు. రోజుకు దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు పెషంట్లు వస్తున్నారని చెప్పారు. దీంతో పెద్ద సంఖ్యలో పెషంట్లు వస్తుండడంతో దవాఖాన కిక్కిరిసిపోయి కనిపిస్తున్నదని చెప్పారు. కొత్త భవనం నిర్మాణమవుతుందని తెలిపారు. మరో మూడు లేదా నాలుగు నెలల్లో కొత్త భవనం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో ఉన్న వైద్యులు, సిబ్బంది సంపూర్ణంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. బయో మెట్రిక్ అటెండెన్స్ తో హాజరు తీసుకుంటున్నామని వివరించారు. జీజీహెచ్ లో మరింత మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. పెషంట్లు కూడా వైద్యులు, సిబ్బందికి సహకరించాలని కోరారు. దవాఖానలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్దంగా ఉందని, వైద్యశాఖ నుంచి ప్రతిపాదనలు పంపామని చెప్పారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
శెనార్తి మీడియాలో ప్రచురితమైన కథనాల లింక్స్
https://epaper.shenarthimedia.in/clip/319