- వాగ్దేవి కళాశాలకు అరుదైన గౌరవం…
- బిఎస్సి (ఎంపీసీఎస్) విభాగంలో గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థిని…
VAAGDEVI RECORD IN MANCHERIAL : 23వ కాకతీయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో మంచిర్యాల వాగ్దేవి డిగ్రీ కళాశాల (VAAGDEVI DEGREE COLLEGE) విద్యార్థిని సాధియా సుల్తానా (SADIYA SULTHANA) గౌరవప్రదమైన గుర్తింపు పొందింది. బీఎస్సీ (ఎం.పీ.సీ.ఎస్) (B.Sc M.P.Cs) విభాగంలో ఆమె నాలుగు బంగారు పతకాలు సాధించి, మంచిర్యాల చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక విద్యార్థినిగా నిలిచింది.
సాధియా సుల్తానా విజయాన్ని కళాశాల కరస్పాండెంట్ పెట్టం మల్లేష్, డైరెక్టర్లు జి. శ్రీకర్, బి. రాజు, ఎస్. మనయ్య, ప్రిన్సిపాల్ మహేందర్, అధ్యాపక బృందం ప్రశంసిస్తూ ఆమెకు అభినందనలు తెలియజేశారు. కళాశాల తరఫున ఆమె కృషి, అంకితభావానికి కీర్తి ప్రతిష్టలు లభించినట్లు వారు పేర్కొన్నారు. ఈ విజయంతో వాగ్దేవి డిగ్రీ కళాశాల ప్రతిష్ట మరింత పెరిగిందని విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :
