BACHI
ముత్యం బుచ్చన్న

GURU BRAHMA AWARD : మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు గురుబ్రహ్మ అవార్డు

GURU BRAHMA AWARD : మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ మోడల్ స్కూల్ (Model School) ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న (Mutyam Buchanna) కు గురుబ్రహ్మ అవార్డు (Guru Brahma Award) లభించింది. గణిత ఒలింపియాడ్‌ (Maths Olympiad) లో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా హైదరాబాద్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ (Srinivasa Ramanujan Foundation) ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి (Rtd. IAS Officer) , మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాశ్ నారాయణ (Jaya Prakash Narayan) చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

BUCHANNA

రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న మంచిర్యాల టీజీఎంఎస్ ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న

గణిత శాస్త్ర బోధనలో విద్యార్థులను రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సన్నద్ధం చేయడంలో బుచ్చన్న చేసిన కృషి ఫలితమే ఈ అవార్డుకు కారణమని మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి (DEO) యాదయ్య, ఎంఈఓ  (MEO) మాలవీ దేవి అభినందించారు. ప్రిన్సిపాల్ బుచ్చన్నకు అవార్డు రావడం పట్ల స్కూల్ అధ్యాపక బృందం, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *