ఏసీబీ వలలో సర్వేయర్ మంజుల, సహాయకుడు (చైన్ మెన్) ఉదయ్‌.
ఏసీబీ వలలో సర్వేయర్ మంజుల, సహాయకుడు (చైన్ మెన్) ఉదయ్‌.

ACB RIDE : మంచిర్యాలలో ఏసీబీ వలలో సర్వేయర్

ACB RIDE : భూసర్వే కోసం లంచం డిమాండ్ చేస్తూ, సర్వేయర్ మంజుల (SURVEYOR MANJULA) అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కుకుంది. బుధవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన దాడిలో మంజులతో పాటు, ఆమె సహాయకుడు (చైన్ మెన్) ఉదయ్‌ (CHAIN MAN UDAY)ను కూడా అదుపులోకి తీసుకున్నారు. సర్వేయర్ మంజుల భూమి కొలిచేందుకు లక్ష రూపాయలు (ONE LAKH RUPEES) డిమాండ్ చేసి, బాధితుడి నుండి విడతల వారీగా రూ.26,500 పొందింది. బాధితుడిని రూ.30,000 ఇవ్వాల్సిందేనని ఆఫీసర్ ఒత్తిడి చేయడంతో, నిస్సహాయ స్థితిలో అతను ఏసీబీ అధికారులను సంప్రదించాడు.

వివరాలు మీడియా కి తెలుపుతున్న ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్
వివరాలు మీడియా కి తెలుపుతున్న ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్

ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ (MANCHERIAL ACB DSP VIJAY KUMAR) ఆధ్వర్యంలో జరిగిన దాడిలో నిందితులు లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆర్‌సీఓ కింద కేసు నమోదు చేసి, నిందితులపై పూర్తి విచారణ జరిపి కోర్టులో ప్రవేశపెడతామని అధికారులు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న లంచాలకు సంబంధించి ఏసీబీకి సమాచారం అందించాలనే విజ్ఞప్తి చేశారు.  మరోవైపు సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని అన్నారు. 1064 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ దాడులలో ఏసీబీ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *