Batukamma Celebrations: జమ్మికుంట పట్టణంలోని వాక్స్పాప్ స్కూల్ విద్యార్థులు అధ్యాపకులతో కలిసి ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రమణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువులోనే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ముందుండాలని సూచించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ప్రతి పండుగను గుర్తుండిపోయేలా ఉత్సాహంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వాక్స్పాప్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ సామల వెంకట్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, జమ్మికుంట
