Councelling
Councelling

Counceling: చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు 

మంచిర్యాల డీసీపీ భాస్కర్

Counceling: చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడినా, ప్రజలకి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించినా చట్టపరమైన చర్యలు తప్పవని మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ అన్నారు. శనివారం మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగార్స్ కి నిర్వహించిన కౌన్సిలింగ్ కు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకలలో ఎలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడకూడదని, ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు. ఈ నూతన సంవత్సర వేడుకలు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జరుపుకోవాలని, మీ వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా మీరు మీ కుటుంబ సమేతంగా తమ తమ ఇళ్లలో సంతోషంగా, చట్టబద్ధంగా నిర్వహించుకోవాలని షీటర్స్, ట్రబుల్ మంగర్ లను హెచ్చరించారు. వేడుకల వేళ మద్యం సేవించి నిర్లక్ష్యంగా మద్యం మత్తులో వేగంగా వాహనాలు నడపడం, ట్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడం, దాడులకు, బెదిరింపులకు పాల్పడడం, రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురిచేసే వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసిపి ఆర్ ప్రకాష్, మంచిర్యాల పట్టణ సీ ఐ ప్రమోద్ రావు, మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీ ఐ నరేష్ కుమార్, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *