SHORT CIRCUIT : శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలోని బుడగ జంగాల కాలనీ (BUDUGA JANGALA COLONY) లో షార్ట్ సర్క్యూట్ (SHORT CIRCUIT) తో ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధమైంది. ఊర అనిల్ (ANIL) కు ఇటీవలే ఇందిరమ్మ ఇల్లు (INDIRAMMA HOUSE) మంజూరు కావడంతో గుడిసెలో ఉంటున్నాడు. ఊరూరా తిరుగుతూ బోళ్లు అమ్ముతూ జీవనం సాగించే అనిల్ ఎప్పటిలాగే ఆది వారం ఉదయం బోళ్లు అమ్మడానికి కుటుంబ సభ్యులతో వెళ్లాడు.
గుడిసె నుంచి పొగలు రావడంతో పక్కింటి వారు అనిల్ కు సమాచారం అందించగా ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఉన్న సామాగ్రితో పాటు అర్ద తులం బంగారం, 10 తులాల వెండి, రూ. 50 వేల నగదు కాలిబూడిదైనట్లు రోదిస్తూ వాపోయాడు. ప్రభుత్వపరంగా తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
– శెనార్తి మీడియా, శంకరపట్నం :
