
Mailala Mallanna : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ముత్తారం(Muttaram) గ్రామంలో ఆదివారం మైలాల మల్లన్న(Mailala Mallanna) స్వామికి భక్తులు బోనాలు చేసి, పట్నాలు వేశారు. ఇటీవల గ్రామంలో నూతనంగా మల్లన్న దేవాలయాన్ని నిర్మించారు. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించారు. పురాతన దేవాలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను శనివారం సాయంత్రం గ్రామ యాదవ సంఘం(Yadava Sagam) నాయకులు బండ సతీష్ వైభవంగా శోభాయాత్ర గా నూతన ఆలయానికి తీసుకెళ్లారు. ఆదివారం గ్రామంలోని యాదవ సంఘం అధ్యక్షుడు మారవేణి రాజయ్య ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామికి బోనాలు సమర్పించారు. లగ్నం, నాగవెల్లి పట్నాలు వేశారు. ఈ కార్యక్రమంలో నూకల, బోబ్బిలి, గుండెబోయిన, నాయిని, కురవేణి బండ, బండి, వంశీయులు, యాదవులు, ముదిరాజులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, శంకరపట్నం