IMA Association: మంచిర్యాల ఓల్డ్ ఐఎంఏ భవన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఐఎంఏ 2025–26 నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. అధ్యక్షుడిగా డాక్టర్ రావుల రవిప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ అనిల్ ముత్తినేని, కోశాధికారిగా డాక్టర్ సంతోష్ చందూరి ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమానికి టీజీఎంసీ లీగల్ & ఎథికల్ కమిటీ సభ్యుడు డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వ్యవస్థను ప్రక్షాళన దిశగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కొత్త కార్యవర్గంపై ఉందన్నారు. ప్రజా ఆరోగ్యం మెరుగుపరచడానికి, నకిలీ వైద్యుల నుంచి ప్రజలను రక్షించడానికి టీజీఎంసీతో కలసి కృషి చేయాలని సూచించారు. ఆరోగ్యరంగాన్ని ఆర్థికంగా దెబ్బతీసే అక్రమ చర్యలపై ఐఎంఏ నుంచి తగిన చర్యలు తీసుకుంటామని కొత్త కార్యవర్గం స్పష్టం చేసింది.
కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చంద్రదత్, డాక్టర్ కేఎంఎన్ శ్రీనివాస్, డాక్టర్ జే. సురేష్, డాక్టర్ సాల్మన్ రాజ్, డాక్టర్ సుఖ్భోగి, డాక్టర్ జ్యోతిర్మయి, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ స్వరూప రాణి, డాక్టర్ ఆర్. కీర్తి, డాక్టర్ కుమార్ A, డాక్టర్ జ్యోతి, డాక్టర్ రమణ, డాక్టర్ భరత్ వంశీ, డాక్టర్ బద్రినారాయణ, డాక్టర్ మల్లేష్, డాక్టర్ ప్రసాద్ చౌదరి, డాక్టర్ శ్రీకాంత్ చీకోటి, డాక్టర్ అభిషేక్ చిద్దం, డాక్టర్ బిల్ల వికాస్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
