DTO: మం చిర్యాల జిల్లా రవాణా శాఖ డీటీఓగా గోపికృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్-1 ద్వారా ఎంపికై నేరుగా మంచిర్యాల జిల్లాలో డీటీఓగా నియమితులయ్యారు. గతంలో డీటీఓగా పనిచేసిన కిష్టయ్య 2024 ఫిబ్రవరి 19న బదిలీపై వెళ్లిన అనంతరం ఇంఛార్జ్ డీటీఓగా సంతోష్ కుమార్ బాధ్యతలు నిర్వహించారు. సుమారు 20 నెలల అనంతరం రెగ్యులర్ డీటీఓగా గోపికృష్ణ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఎంవీఐలు తుల్సిరాం, సంతోష్ కుమార్, కిశోర్ చంద్రా రెడ్డి, రంజిత్‌లతో పాటు ఏఎంవీఐలు ఖాసీం, సాయి, లెనిన్, సూర్యతేజలు కొత్త డీటీఓ గోపికృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల
