- దొంగలను ఇట్టే పట్టేస్తున్న రామగుండం సైబర్ టీం
- చోరికి గురైన 200 మొబైల్ ఫోన్లు యజమానులకు అందజేత
Mobiles Recovery : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొబైల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి, చోరికి గురైన 200 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు ₹25.68 లక్షల విలువ గల ఫోన్లు యజమానులకు అప్పగించారు.
సీసీఎస్, ఐటీ సెల్ బృందాలు చురుకైన చర్యల ద్వారా ఫోన్ల ఆచూకీ కనుగొన్నాయి. *CEIR (Central Equipment Identity Register)* పోర్టల్ సద్వినియోగంతో ఇప్పటివరకు 5280 ఫిర్యాదులు అందుకొని, 1538 ఫోన్లు రికవరీ చేశారు. సీపి శ్రీనివాస్ మాట్లాడుతూ, CEIR పోర్టల్ ఫోన్ల ఆచూకీ కనుగొనడంలో కీలకమని, ఇది చోరీలు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రాజు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ కమలాకర్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల/రామగుండం
