Divakar Rao
Divakar Rao

Divkar Rao Nadipally : పదవి లేకున్నా.. ప్రజాక్షేత్రంలోనే..

  • 70 ఏళ్ల యంగ్ లీడర్..
  • ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసేవలో మాజీ ఎమ్మెల్యే
  • కార్యకర్తలకు అండగా ఉంటున్న నడిపల్లి
  • వయసును సైతం లెక్క చేయకుండా అధికార పార్టీ ఆగడాలపై ఆందోళనల బాట
  • కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిత్యం జనాల మధ్యలోనే
  • స్థానిక ఎమ్మెల్యే అనాలోచిత నిర్ణయాలను ప్రశ్నిస్తున్న వైనం
DIVAKAR RAO
రాస్తారోకో చేస్తున్న బీ ఆర్ ఎస్ నాయకులు(ఫైల్)
  • Divkar Rao Nadipally : 40 ఏళ్ల పైగా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు నిర్వర్తించారు… ఏడు పదుల వయసులో మనువలు, మనవరాళ్లతో కాలక్షేపం చేయాల్సిన సమయంలోనూ ప్రజా క్షేత్రంలోనూ ఉంటున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా ప్రజా సమస్యల పరిష్కారంలో కోసం ప్రతిపక్ష పార్టీగా నిత్యం జనాల్లోనే ఉంటున్నాడు. ఎన్నికల సమయంలో కనిపించే నాయకుల కన్నా ఆయన మాత్రం భిన్నం. ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉన్నా, ప్రజల గురించి నాకెందుకులే అని అనుకోవడం లేదు. ప్రజాప్రతినిధిగా పదవి లేకుంటే కొందరు లీడర్లు బయటికి రారు. మరో వైపు కుమారుడు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నా తాను మాత్రం పాలిటిక్స్ కు దూరం కాలేదు. పార్టీలోనూ తన స్థాయికి తగ్గ పదవి లేకున్నా ప్రజాక్షేత్రంలో తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే 70 ప్లస్ వయసులో కూడా పార్టీ పిలపునిచ్చిన ఆందోళన కార్యక్రమాల్లో దూకుడుగా ముందుకు సాగుతూ నేటి యువకులకు సవాల్ విసురుతున్నాడు.. ఇదంతా చెబుతున్నది మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గురించి..స్వరాష్ర్టంలో దాదాపు తొలి పదేళ్లు రాష్ర్టంలో అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారారానికి దూరమైన విషయం తెలిసిందే. రాష్ర్టంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీఆర్ఎస్ ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా మంచిర్యాల జిల్లాలో తనే అందరి కంటే ముందుటున్నాడు. జిల్లాలో అటు పార్టీకి, ఇటు కార్యకర్తలకు పెద్ద దిక్కుగా నిలుస్తున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మెజార్టీ లీడర్ల కన్నా చాలా చురుగ్గా పార్టీ కార్యక్రమాలను చురుగ్గా ముందుకు తీసుకెళ్తున్నారు.

మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు 1953లో నాటి ఉమ్మడి ఆదిలాబాద్‌లో జన్మించారు. బీఏ వరకు చదివిన దివాకర్ రావు రాజకీయాల్లోకి రాకముందు వ్యవసాయం చేశారు. తొలుత కాంగ్రెస్ పార్టీ లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు దివాకర్ రావు. 1981లో మంచిర్యాల మున్సిపాలిటీ వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1983-1992 వరకు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా పని చేశారు. 1987లో ఆసిఫాబాద్ డివిజన్‌లో అత్యధిక మెజార్టీతో మంచిర్యాల మండల సింగిల్ విండో చైర్మన్‌గా విజయం సాధించారు. 1989 నుంచి 1999 వరకు మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి నాటి లక్సెట్టిపేట (అసెంబ్లీ నియోజకవర్గం) నుంచి శాసన సభ్యుడిగా విజయం సాధించారు. 2004 లో కాంగ్రెస్ టికెట్ పై మరోసారి అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2014లో సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ పొంది మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అరవింద్ రెడ్డిపై 59 వేల ఓట్ల మెజారిటీతో విజయం ఢంకా మోగించారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మళ్లీ మరోసారి టీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై 4 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినా కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

Nadipelli-Diwakar-Rao1
అరుణక్క నగర్ లో స్థానికులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్య దివాకర్ రావు

మంచిర్యాల జిల్లాలో యాక్టివ్ లీడర్ దివాకర్ రావే..
రాష్ర్టంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ అధికార పార్టీ వైఫల్యాలు, అనాలోచిత నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలంటూ పలు ఆందోళనలకు పిలుపునిస్తున్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హంగామా చేసిన అప్పటి లీడర్లు ప్రస్తుతం అధికారంలో లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి క్యాండిడేట్లు సైతం పార్టీ చేపట్టే ఆందోళనల్లో పెద్దగా పాల్గొనడం లేదు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం మిగతా వారికంటే పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నది దివాకర్ రావు అని కచ్చితంగా చెప్పవచ్చు.

X MLA
ఇసుక తవ్వగా గోదావరి నదిలో ఏర్పడ్డ గోతులను చూపుతున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టే కార్యక్రమాలు విజయవంతంమవుతున్నాయి. కరెంటు కోతలు, రుణమాఫీ, బొగ్గు గనుల ప్రైవేటీకరణ, అధికార పార్టీ ఎమ్మెల్యే అనధికారికంగా ఇస్తున్న కూల్చివేతలకు వ్యతిరేకంగా తన గళం వినిపస్తున్నారు. గనులపై నిరసనలు, కాళేశ్వరం నీటి విడుదలకు సంబంధింని బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాలను నడిపెల్లి తన భుజాన వేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు.

EX MLA
గోదావరి నదిలో ఏర్పడ్డ గోతిలో నిలబడి చూపుతున్న మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు

కౌన్సిలర్ ఆత్మహత్యాయత్నంపై ఆందోళన..
కొన్ని నెలల క్రితం నస్పూర్ మున్సిపాలిటీకి చెందిన మాజీ వార్డు కౌన్సిలర్ బేర సత్యనారాయణ మంచిర్యాల ఏసీపీ ఆఫీసులో బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తనపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని సత్యనారాయణ ఆరోపించారు. తమ అనుచరుడిపై వేధింపులను నిరసిస్తూ దివాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. కార్యకర్తలతో కలిసి రహదారిపై బైఠాయించారు. పోలీసులు తమ పార్టీ కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేయగా ఎదురెళ్లి అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పీఎస్సార్ ఆగడాలపై తన దైన శైలిలో విరుచుకుపడ్డారు.

EX MLA-Nadipelli-Diwakar-Rao
మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

వయోభారం దరి చేరనివ్వకుండా..
బీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని ఓ పక్క కాంగ్రెస్ భావిస్తుండగా, మంచిర్యాలలో వాటిని తిప్పికొడుతున్నారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. తన వయసు సహకరించకున్నా ప్రజా సమస్యల పరిష్కానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పడుతున్నారు. దివాకర్ రావు దూకుడుతత్వాన్ని చూసి పార్టీ కార్యకర్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు. వయోభారాన్ని ఏ మాత్రం దరి చేరనివ్వడం లేదని కార్యకర్తలు చెబుతున్నారు.

తండ్రి వెంటే తనయుడు
నడిపెల్లి దివాకర్ రావు వారసుడు విజిత్ రావు సైతం పార్టీ కార్యక్రమాలను తండ్రితో కలిసి కోఆర్డినేట్ చేస్తున్నారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో నిత్యం టచ్ లో ఉంటున్నారు. తన వెంటే కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా తండ్రి దివాకర్ రావు కన్నా ముందుంటున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను తన కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తున్నారు.
బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఈ నెల 27న నిర్వహించనున్న సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులను ఎల్కతుర్తికి తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *