COURT JUDGEMENT : మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన వారికి మంచిర్యాల సెకండ్ అడిషనల్ కోర్ట్ జడ్జి నిరోషా శిక్ష విధించినట్లు మంచిర్యాల ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం కోర్టులో 33 మందిని హాజరుపర్చగా 29 మందికి 65,500 రూపాయలు జరిమానా విధించారని, మరో నలుగురికి ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు సీఐ వెల్లడించారు. ఈ సంధర్భంగా సీఐ మాట్లాడుతూ వాహనదారులు మద్యం తాగి నడుపరాదని, విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :