VOTE
సన్మానిస్తున్న కలెక్టర్

RIGHT TO VOTE :  ఓటు హక్కు ఎంతో విలువైనది…

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

RIGHT TO VOTE : భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఓటు హక్కు ఎంతో విలువైందని, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరు తమ వివరాలు నమోదు చేసుకొని ఓటు హక్కు పొంది ఎన్నికల సమయంలో ఖచ్చితంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్ లో శనివారం నిర్వహించిన 15వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ లతో కలిసి పాల్గొన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా వీడియో ద్వారా భారత ఎన్నికల సంఘం కమీషనర్ రాజీవ్ కుమార్ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే మన దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగి ఉందని, 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరు తమ ఓటు వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఒక్క ఓటుతో గెలుపు, ఓటములు స్థానాలు మారుతాయన్నారు. అర్హత కలిగి ఓటు లేని వారు వారి వివరాలను జాబితాలో నమోదు చేసుకోవాలని తెలిపారు.

యువ ఓటర్లు తమ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఓటు వేసేలా ప్రోత్సహించాలన్నారు. ఎన్నికల సమయంలో అర్హత గల వారు స్వచ్ఛందంగా, పారదర్శకంగా, నిస్పక్షపాతంగా, నిర్భయంగా, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అనంతరం 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఓటును మించింది ఏమీ లేదని – నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను’ అనే నినాదంతో అధికారులు, విద్యార్థినీ, విద్యార్థులు, సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. నూతనంగా ఓటు నమోదు చేసుకున్న వారికి ఎపిక్ కార్డులు పంపిణీ చేయడంతో పాటు బీ ఎల్ ఓలను, వృద్ధులను, యువ ఓటర్లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కళాశాలల, పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *