- వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
- పాఠశాల విద్యాశాఖ వరంగల్ RJD సత్యనారాయణ రెడ్డి
RJD : పదవ తరగతి విద్యార్థులు వార్షిక (FINAL) పరీక్షలకు ఎలాంటి ఒత్తిడి చెందకుండా, ఉపాధ్యాయుల మార్గదర్శకాన్ని అనుసరించి, ధైర్యంగా పరీక్షలను ఎదుర్కొవాలని పాఠశాల విద్యాశాఖ వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్ జే డీ) సత్యనారాయణ రెడ్డి కోరారు. మంగళవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం తీగల్ పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(ZPHS)ను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి జరిపారు. ఈ సందర్భంగా టీ శాట్ ( T-SAT) ఛానల్ ద్వారా విద్యాశాఖ సెక్రటరీ యోగితా రానా విద్యార్థులకు ఇచ్చిన ప్రత్యేక సందేశం ఇచ్ఛారు. అనంతరం విద్యార్థులతో ఆర్ జే డీ (RJD) మాట్లాడారు.
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
పది సిలబస్ పూర్తయినందున ఇకపై సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆర్ జే డీ సత్యనారాయణ రెడ్డి ఆకాంక్షించారు. పరీక్మాషలను ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా ఆనందంగా రాయాలని కోరారు. సెక్రటరీ సూచనలను ప్రతి ఒక్క విద్యార్థి పాటించాలని, ఇది వారిని విజయపథంలో నడిపిస్తుందని పేర్కొన్నారు. క్రమ శిక్షణతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.

అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించిన ఆర్ జే డీ (RJD) ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు(HEAD MASTERS), ఉపాధ్యాయుల(TEACHERS)కు మార్గదర్శకాలు అందించారు. పదవ తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులకు అండగా నిలవాలని సూచించారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :