- పాఠశాల విద్యాశాఖ ఆర్ జే డీ సత్యనారాయణ రెడ్డి
RJD : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుణాత్మక విద్య అందించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోందని, వాటిని పకడ్బందీగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ వరంగల్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్ జే డీ) సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఇంఛార్జీ జిల్లా విద్యాశాఖాధికారి లలిత సమక్షంలో నస్పూర్‌లో మంగళవారం జిల్లాలోని విద్యా శాఖ అధికారులు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, హై స్కూల్ హెచ్ఎంలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వంద శాతం ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. విద్యాశాఖ అమలు చేస్తున్న ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.

♠ పాఠశాల వసతుల మెరుగుదలపై దృష్టి…
ప్రభుత్వం అందిస్తున్న నిధులను నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలని, పాఠశాలల్లో వసతుల వివరాలను యూ డైస్ ఫ్లస్ లో సక్రమంగా నమోదు చేయడం ద్వారా పిజిఐలో జిల్లా, రాష్ట్ర ర్యాం మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని ఆర్ జే డీ సత్యనారాయణ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వర్తించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో ఇన్‌చార్జ్ జిల్లా విద్యాధికారి లలిత, పరీక్షల విభాగం సహాయ కమిషనర్ దామోదర్ రావు, జిల్లా సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు చౌదరి, యశోదర, శ్రీనివాస్, సత్యనారాయణమూర్తి, ఏఎస్సీ రాజ్‌కుమార్, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :