- ఐటీడీఏ పీఓ ఖుష్భూ గుప్తా
GANDHARI KHILLA : జిల్లాలోని మందమర్రి మండలం క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 16న జరిగే గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలని ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ITDA) ప్రాజెక్టు అధికారి (PO) ఖుష్భూ గుప్తా అన్నారు. శనివారం గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరలో ఎపిఓ(APO) పివిటిజి (PVTG) మనోహర్, ఎటిడిఓ (ATDO) పురుషోత్తం, నాయక్ పోడ్ సంఘం ప్రతినిధులతో కలిసి కాలభైరవ స్వామిని, మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను అధికారులు సమన్వయంతో కృషి చేసి విజయవంతం చేయాలని కోరారు.

జాతరలో పారిశుద్ధ్యం, భక్తులకు త్రాగునీరు ఇతర సౌకర్యాలు కల్పించాలని, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు భోజన ఏర్పాట్లు చేయాలని, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని నియమించి అత్యవసర వైద్య సేవలు అందించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివాసీ సంఘాల నాయకులు, జాతర కమిటీ ప్రతినిధులు అధికార యంత్రాంగానికి సహకరిస్తూ జాతర ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగే విధంగా సహకరించాలని కోరారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :