Breakup: సినిమా ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రెటీలు ప్రస్తుతం తమ వివాహబంధానికి ముగింపు పలుకుతున్నారు. చాలా సంవత్సరాల నుంచి వైవాహిక జీవితంలో అన్యోన్యంగా ముందుకు సాగిన వారంతా కూడా ఇప్పుడు విడాకులు బాట పడుతుండడం సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరినీ తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఇక సాధారణ ప్రేక్షకులకు సినిమా ఇండస్ట్రీ మీద, వాళ్ల పెళ్లిళ్ల మీద నమ్మకం కోల్పోతున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలోని సెలబ్రెటీలకు వివాహాలు అవుతున్నాయంటే వీళ్లు కలిసి ఉండేది ఎన్ని రోజులో అని అని సగటు ప్రేక్షకులు భావించే స్థాయికి వారి వివాహ బంధం దిగజారి పోయిందని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇక ఈ ఒక్క సంవత్సరంలోనే చాలామంది సినీ ప్రముఖులు విడాకులు తీసుకున్నారు. వారెవరెవో ఒకసారి తెలుసుకుందాం.
ఏఆర్ రహమాన్ – సైరాభాను
సంగీత దర్శకుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డు కూడా సాధించాడు. అలాంటి ఏఆర్ రెహమాన్ 1995 లో సైరా భాను ని వివాహం చేసుకున్నాడు. ఇక 29 ఏళ్ల పాటు వీరి వైవాహిక జీవితం చాలా సాఫీగా సాగింది. ఇప్పుడీ సంగీత దిగ్గజం తన భార్య సైరా భాను కు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక రెహమాన్ అసిస్టెంట్ మోహిని డే కూడా తన భర్త మార్క్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. దీంతో రెహమాన్- మోహినీల మధ్య ఏదో సంబంధం ఉందనే విషయం స్పష్టమవుతున్నది.
ధనుష్ – ఐశ్వర్య రజినీకాంత్
కోలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న హీరో ధనుష్.. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు18 ఏళ్ల పాటు సజావుగా సాగిన వీళ్ల జీవితంలో పొరపచ్చాలు వచ్చాయి. రెండేళ్ల క్రితం నుంచే వేర్వేరుగా ఉంటున్నారు. 2022 లో విడాకులకు దరఖాస్తు చేసుకున్న ఈ జంటకు 2024 నవంబర్ 27న కోర్టు నుంచి డైవర్స్ కు అప్రూవల్ వచ్చింది. వీరికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే.
జీవీ ప్రకాష్ కుమార్ – సైంధవి
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న జీవీ ప్రకాష్ కుమార్ సింగర్ సైంధవి ని 2013లో పెళ్లి చేసుకున్నాడు. ఇక 2020 వ సంవత్సరంలో వీళ్లకు ఒక పాప కూడా ఉంది. అప్పటి నుంచి వీళ్ల వైవాహిక జీవితం చాలా సంతోషంగా ముందుకు సాగుతుందని అందరూ అనుకునే లోపే ఈ సంవత్సరం ఈ జంట విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించారు.
ఊర్మిళ – మోసిన్ అక్తర్ మీర్
ప్రముఖ హీరోయిన్ ఊర్మిళ తన భర్త అయిన మోసిన్ అక్తర్ మీర్ విడాకులు తీసుకున్నట్లుగా ప్రకటించింది. ఇక 2016 లో పెళ్లి చేసుకున్న ఈ జంట వాళ్ల 8 ఏళ్ల వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెట్టినట్లు సమాచారం.
యువ రాజ్ కుమార్ – శ్రీదేవీ బైరప్ప
రాజ్ కుమార్ మనవడు యువరాజ్ కుమార్ శ్రీదేవి బహిరప్పను 2019 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట వైవాహిక బంధం కూడా విచ్చిన్నమవుతున్నది. వీరిద్దరూ కూడా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కాంతారా హీరోయిన్ సప్తమి గౌడతో రాజ్ కుమార్ కు రిలేషన్ షిప్ ఉందని, అందుకే తనకు విడాకులు ఇస్తున్నాడంటూ శ్రీదేవి బైరప్ప ఆరోపించింది. దీంతో సప్తమి గౌడ శ్రీదేవిపై రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేసింది.
అర్జున్ కపూర్ – మలైకా అరోరా
బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా గుర్తింపు పొందిన అర్జున్ కపూర్- మలైకా అరోరా సైతం విడిపోయినట్లు సమాచారం. 2018 నుంచి డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ ప్రస్తుతం ఎవరికి వారే విడిగా ఉంటున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల మలైకా అరోరా బర్త్ డేలో అర్జున్ కపూర్ కనిపించకపోవడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చుతున్నది.
